“సర్కారు వారి పాట” నుంచి సర్ప్రైజ్ సాంగ్ వచ్చేసింది..!

Published on Jun 7, 2022 2:00 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా దర్శకుడు పరశురాం పెట్ల తెరకెక్కించిన లేటెస్ట్ సాలిడ్ బ్లాక్ బస్టర్ చిత్రం “సర్కారు వారి పాట”. భారీ అంచనాలు నడుమ రిలీజ్ అయ్యిన ఈ చిత్రం అభిమానులకి మంచి ట్రీట్ ఇచ్చింది. ఇక ఇదిలా ఉండగా రీసెంట్ గా మేకర్స్ ఈ సినిమాలో దాచిన సర్ప్రైజింగ్ సాంగ్ మురారి వా ని థియేటర్స్ లో రిలీజ్ చేశారు.

అయితే దీనికి కూడా మంచి రెస్పాన్స్ రాగా ఇప్పుడు దీనిని మేకర్స్ ఫుల్ వీడియో సాంగ్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. మరి ఇక్కడ కూడా మంచి రెస్పాన్స్ ని తెచ్చుకుంటుంటూ సోషల్ మీడియాలో సినిమా ట్యాగ్ ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు సంయుక్తంగా నిర్మించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :