సూర్య 40 వ చిత్రం ఫస్ట్ లుక్ కి ముహూర్తం ఫిక్స్… రచ్చ షురూ చేసిన అభిమానులు!

Published on Jul 19, 2021 1:00 pm IST

సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ సమర్పణ లో పాండిరాజు దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం సూర్య 40. అయితే ఈ చిత్రం కి సంబంధించిన ఫస్ట్ లుక్ ఈ నెల 22 వ తేదీన సాయంత్రం 6 గంటలకు చిత్ర యూనిట్ విడుదల చేయనుంది. అయితే ప్రముఖ నటుడు సూర్య వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. అటు మణిరత్నం క్రియేషన్ లో వస్తున్న నవరస అంథాలజీ చిత్రం లో నటిస్తూనే, ఇటు వాడివసల్, 40 వ చిత్రం లో నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం ఫస్ట్ లుక్ సూర్య పుట్టిన రోజు సందర్భంగా విడుదల కానుంది.

అయితే ఈ చిత్రం లో ప్రియాంక ఆరుల్ మోహన్ సూర్య సరసన హీరోయిన్ గా నటిస్తుండగా, ఈ చిత్రానికి సంగీతం ఇమ్మాన్ అందిస్తున్నారు. రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అయితే ఇటు సూర్య పుట్టిన రోజు కి విడుదల అవుతుండటం తో అభిమానులు సోషల్ మీడియా ద్వారా రచ్చ షురూ చేశారు. అయితే ఇప్పటికే సూర్య 40 ఫస్ట్ లుక్ హ్యష్ ట్యాగ్ సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతుండటం విశేషం.

సంబంధిత సమాచారం :