‘సూర్య’ సినిమా వచ్చే నెల నుండి.. !

‘సూర్య’ సినిమా వచ్చే నెల నుండి.. !

Published on May 13, 2019 8:23 AM IST

స్టార్ హీరో సూర్యతో తన తరువాత సినిమాను ప్లాన్ చేసుకున్నాడు ‘విశ్వాసం’ ఫేమ్ డైరెక్టర్ శివ. ఇటీవలే అధికారికంగా ప్రారంభమైన ఈ సినిమా ఈ నెలాఖర్లో షూట్ కి వెళ్లాలనుకునప్పటికీ.. అది సాధ్యమయ్యేలా కనిపించట్లేదు. శివకి వైరల్ ఫీవర్ కారణంగా కొద్ది రోజుల నుండి సినిమా పనులకు దూరంగా ఉన్నారు.

కాగా వచ్చే నెల మొదటి వారం నుండి ఈ సినిమా రెగ్యూలర్ షూట్ మొదలు కానుందని సమాచారం. ఇక ఈ సినిమా కూడా శివ గత సినిమాల శైలిలోనే పక్కా మాస్ అంశాలతో మంచి ఎమోషనల్ గా సాగుతుందట. ముఖ్యంగా సూర్య క్యారెక్టర్ చాలా బాగుంటుందని తెలుస్తోంది.

ఇక గోపీచంద్ తో ‘శౌర్యం’ సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు శివ. ఆ తరువాత తమిళ స్టార్ అజిత్ తో వరుసగా సినిమాలు తీసి బ్లాక్ బస్టర్స్ హిట్స్ అందుకున్నాడు. ఇటీవలే అజిత్ హీరోగా ‘విశ్వాసం’ను తెరకెక్కించాడు. అయితే తెలుగులో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపించకపోయినప్పటికీ.. తమిళంలో మాత్రం భారీ విజయాన్ని సాధించింది. దాంతో సూర్య, సినిమా చెయ్యడానికి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు