‘ఎన్‌జీకే’ లేటెస్ట్ అప్ డేట్ !

Published on Dec 3, 2018 1:11 pm IST

తమిళ స్టార్ హీరో సూర్య 36వ చిత్రంగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో ‘ఎన్జీకె’ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కోలీవుడ్ సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం యొక్క చివరి షెడ్యూల్ చిత్రీకరణ ఈ రోజు చెన్నైలో ప్రారంభమైంది.

కాగా ఈ చిత్రంలోసూర్య రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించనుండగా ఆయన సరసన రకుల్ ప్రీత్ సింగ్ , సాయి పల్లవి కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవికి రిలీజ్ చేయనున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యువ సంగీత సంచలనం యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు.

ఇక సూర్య నటిస్తున్న 37వ చిత్రం కూడా ఇటీవలే ఓ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. కేవీ ఆనంద్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మోహన్ లాల్ , ఆర్య తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :