యాక్షన్ హీరోతో మాస్ డైరెక్టర్ ?

Published on Oct 11, 2018 10:00 pm IST

తమిళ దర్శకుడు హరి మరియు విలక్షణ నటుడు సూర్య కాంబినేషన్ అంటే… అటు తమిళంలోనే కాకుండా ఇటు తెలుగులో కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. వీరి ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింగం సిరీస్ చిత్రాలే ఇందుకు నిదర్శనం, దానికి తోడు సూర్య ఫాన్స్ సూర్యని ఎలా చూడాలనుకుంటారో.. అంతకు మించి పవర్ ఫుల్ గా సూర్యని పోలీసు పాత్రలో చూపిస్తాడు హరి.

కాగా దర్శకుడు హరి ఇటీవలే చియాన్ విక్రమ్ తో సామి చిత్రానికి సీక్వెల్ గా సామి స్క్వేర్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చినప్పటికీ.. ఆ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. కాగా తాజాగా కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం హరి తన తర్వాతి ప్రాజెక్ట్ కు సంబంధించిన లైన్ ను సూర్యకి చెప్పాడట. సూర్య కూడా హరి చెప్పిన పాయింట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తానికి హరి ఈ సారి హిట్ కొట్టాలనే కసి మీద ఉన్నాడట. పైగా వీరిద్దరి కాంబినేషన్ పై ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలు ఉంటాయి.

సంబంధిత సమాచారం :