ఇండియా లెవెల్ రికార్డు కొట్టిన హీరో సూర్య.

Published on Jul 12, 2020 5:15 pm IST

టాలెంట్ హీరో సూర్య బర్త్ డే కామన్ డీపీ ఇండియా లెవెల్ రికార్డు కొట్టింది. ఏకంగా 6మిలియన్ ట్వీట్స్ తో సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. ఈనెల 23న హీరో సూర్య పుట్టినరోజు. దీనితో సూర్య ఫ్యాన్స్ సూర్య బర్త్ డే ఫెస్ట్ సీడీపీ అనే యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు. 6 మిలియన్ ట్వీట్స్ దక్కించుకున్న సూర్య బర్త్ డే సీడీపీ ఇండియాలోనే ఆ ఘనత అందుకున్న సీడీపీ గా నిలిచింది. ఇండియా వైడ్ రికార్డు కొట్టినందుకు సూర్య ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

ఇక సూర్య లేడీ డైరెక్టర్ సుధా కొంగరతో సురారై పోట్రు మూవీ చేస్తున్నారు. తెలుగులో ఈ చిత్రం ఆకాశం నీహద్దురా అనే టైటిల్ తో విడుదల కానుంది. ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. డెక్కన్ ఎయిర్ వేస్ ఫౌండర్ జి ఆర్ గోపీనాధ్ జీవిత కధ ఆధారంగా తెరకెక్కుతుంది. ఇక ఈ మూవీలో నటుడు మోహన్ బాబు ఓ కీలక రోల్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More