డిఫరెంట్ టైటిల్ తో వస్తున్న అక్కినేని హీరో.

Published on Dec 21, 2019 3:56 pm IST

అక్కినేని కుటుంబం నుండి సుశాంత్ హీరోగా ఎంట్రీ ఇచ్చి దాదాపు దశాబ్ధం దాటిపోయింది. 2008లో వచ్చిన కాళిదాస్ మూవీతో అతను తెరంగేట్రం చేశాడు. ఆ తదుపరి చిత్రం కరెంట్ తో హిట్ అందుకున్న సుశాంత్ ఆతర్వాత చేసిన చిత్రాన్ని షాక్ ఇచ్చాయి. గత ఏడాది చి ల సౌ అనే రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ చేశారు. ఇక బన్నీ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం అలవైకుంఠపురంలో ఓ కీలక రోల్ చేస్తున్నారు.

కాగా సుశాంత్ హీరోగా ఓ నూతన చిత్రాన్ని ప్రకటించారు. ‘ఇచ్చట వాహనాలు నిలుపరాదు’ అనే ఓ విభిన్నమైన టైటిల్ తో వస్తున్న ఈ చిత్రానికి ఎస్ దర్శన్ దర్శకత్వం వహిస్తుండగా.. ఏ వన్ స్టూడియోస్, సహస్త్ర మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. టైటిల్ తోనే సుశాంత్ మూవీ పై ఆసక్తి రేపాడు. నేడు ఈ చిత్ర మోషన్ పోస్టర్ విడుదల చేయడం జరిగింది.

సంబంధిత సమాచారం :