లేటు వయసులో పెళ్లికి సిద్దమైన విశ్వసుందరి…!

Published on Aug 1, 2019 9:13 am IST

1994లో మిస్ ఇండియా, మిస్ యూనివర్స్ కిరీటాలను సాధించిన సుస్మితా సేన్ పలు హిందీ చిత్రాల్లో నటించారు. తెలుగులో నాగార్జున హీరోగా వచ్చిన ‘రక్షకుడు’ సినిమాలో హీరోయిన్ గా చేశారు. జెడి చక్రవర్తి హీరోగా వచ్చిన డబ్బింగ్ చిత్రం “మర్రి చెట్టు”లో కూడా సుస్మిత నటించడం జరిగింది. సుస్మిత ఇప్పటికీ వివాహం చేసుకోలేదు, ఐతే రొహ్మన్ చావల్ అనే మోడల్ తో గత కొన్నేళ్లుగా ఆమె సహజీవనం చేస్తున్నారు.

కాగా తాజాగా వీరిద్దరూ తమ బంధాన్ని పెళ్లితో దృఢపరిచే యోచనలో ఉన్నారని సమాచారం. ఓ ఫ్యాషన్ షోలో కలిసిన వీరిద్దరూ ప్రేమలో పడ్డారట. అప్పటి నుండి ఈ జంట విందులు,విహారాలంటూ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు. దీనితో కొద్దిరోజులుగా వీరిబంధం పై మాధ్యమాలలో ప్రముఖంగా వార్తలు వస్తున్నాయి. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం నవంబర్ నెలలో ఈ జంట పెళ్లి పీటలెక్కే అవకాశం కలదు.

ఆశ్చర్యకర విషయం ఏమిటంటే సుష్మిత కంటే రొహ్మన్ 14 ఏళ్ల చిన్నవాడు. ప్రస్తుతం సుష్మిత వయసు 42 కాగా, రొహ్మన్ వయసు కేవలం 28 మాత్రమే. ఇప్పటికే రీనె, అలీషా అనే ఇద్దరు అమ్మాయిలను సుస్మిత దత్తత తీసుకొవడం జరిగింది.

సంబంధిత సమాచారం :