మరో ఆడపిల్ల కోసం పదేళ్లు పోరాడిన నటి

మరో ఆడపిల్ల కోసం పదేళ్లు పోరాడిన నటి

Published on Jul 29, 2019 11:59 AM IST

నటి సుష్మితా సేన్ నిన్న హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరై సందడి చేశారు. యంగ్ ఫిక్కీ లేడీస్ ఆర్గనైసేషన్ ఛైర్పర్సన్ శిల్పా దట్లా ఆహ్వానం మేరకు దత్తత పై నిర్వహించిన ఈ కార్యక్రమానికి సుష్మిత హాజరై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పిల్లల దత్తతకు సంబందించిన చట్టాలను సరళతరం చేయాలని ఆమె సూచించారు. దత్తత లో క్లిష్టమైన నిబంధనల వలన దత్తత తీసుకోవడానికి ఆసక్తివున్నవారు కూడా వెనుకంజ వేస్తున్నారని చెప్పారు.

తాను ఒక అమ్మాయిని దత్తత తీసుకున్నాక, మరో అమ్మాయిని దత్తత తీసుకోవడానికి పదేళ్ల భారత చట్టాలతో పోరాడాల్సివచ్చింది అన్నారు. ఒక అమ్మాయిని దత్తత తీసున్నాక రెండవ అమ్మాయిని దత్తత తీసుకోవడానికి చట్టాలు ఒప్పుకునేవి కాదని, సుప్రీం కోర్ట్ పై నా పోరాటంతో చట్టంలో మార్పులు తీసుకురాగలిగాను అన్నారు. 2000 సంవత్సరంలో ఓ పాపను దత్తత తీసుకున్న సుష్మిత సేన్,2010 లో మరో పాపను దత్తత తీసుకోవడాన్ని చట్టం నిరాకరించడంతో ఆమె పదేళ్లు పోరాటం చేసి గెలిచారు.

1994లో మిస్ ఇండియా, మిస్ యూనివర్స్ కిరీటాలను సాధించిన సుస్మిత పలు హిందీ చిత్రాల్లో నటించారు. తెలుగులో నాగార్జున హీరోగా వచ్చిన ‘రక్షకుడు’ సినిమాలో హీరోయిన్ గా చేశారు. జెడి చక్రవర్తి హీరోగా వచ్చిన డబ్బింగ్ చిత్రం “మర్రి చెట్టు”లో కూడా సుస్మిత నటించడం జరిగింది. 43ఏళ్ల సుస్మిత ఇప్పటికీ వివాహం చేసుకోలేదు. ఐతే రోహన్ చావల్ అనే మోడల్ తో ఆమె సహజీవనం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు