“అఖండ” సస్పెన్స్..ఆ నెలకి షిఫ్ట్ అయ్యిన రిలీజ్ డేట్.?

Published on Oct 21, 2021 7:00 am IST


ఇప్పుడు నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఎవర్ మోస్ట్ అవైటెడ్ చిత్రం “అఖండ”. దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కించిన సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ చిత్రం ఇది. అందు చేతనే భారీ స్థాయి అంచనాలు ఈ సినిమాపై నెలకొన్నాయి కానీ ఆ అంచనాలకు తగ్గట్టు గానే సినిమా రిలీజ్ డేట్ అభిమానులు కు అందని ద్రాక్ష లా సస్పెన్స్ గానే మిగిలింది.

ఇదిగో ఈ పండక్కి ఆ పండక్కిఆ ని టాక్ వస్తున్నా మేకర్స్ మాత్రం ఇంకా సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారు అని తెలుస్తుంది. అలా ఈ వచ్చే నవంబర్ దీపావళి కానుకగా అఖండ గర్జన ఉంటుంది అని బజ్ వినిపించింది కానీ లేటెస్ట్ గా మాత్రం ఈ సినిమా డిసెంబర్ నెలకి షిఫ్ట్ అయ్యుపోయినట్టుగా సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించగా థమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ద్వారకా క్రియేషన్స్ వారు ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు.

సంబంధిత సమాచారం :