మహేష్ నెక్స్ట్ పై కొనసాగుతున్న ఉత్కంఠ.!

Published on Jan 18, 2021 12:00 am IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస మూడు భారీ హిట్స్ తో హ్యాట్రిక్ విజయాలను అందుకున్న సంగతి తెలిసిందే. మరి దీని తర్వాత దర్శకుడు పరశురామ్ తో “సర్కారు వారి పాట” అనే మరో మాస్ ఫ్లిక్ ను లైన్ లో పెట్టారు. ఇక దీని తర్వాత దర్శక ధీరుడు రాజమౌళితో ఒక భారీ చిత్రాన్ని ప్లాన్ చేశారు.

కానీ దానిని మొదలు పెట్టే లోపు మరో చిత్రాన్ని మహేష్ చేసేయాలని ఫిక్స్ అయ్యారు. కానీ అది ఎవరితో చేస్తారా అన్నది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. ఈ రేస్ లో చాలా మంది టాప్ దర్శకుల పేర్లే వినిపిస్తున్నా ఫైనలైజ్ లిస్ట్ మాత్రం ఇద్దరు దర్శకుల పేర్లే వినిపిస్తున్నాయి. వాటిలో ఒకటి వంశీ పైడిపల్లి కాగా మరొకటి కోలీవుడ్ దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్.

అయితే త్రివిక్రమ్ పేరు కూడా ఉంది కానీ త్రివిక్రమ్ ముందు తారక్ తో చేసి ఆ తర్వాత రామ్ తో సినిమా చెయ్యాల్సి ఉంది సో దానికి చాలా టైం ఉంది కాబట్టి మహేష్ నెక్స్ట్ కు దాదాపు ఆ ఇద్దరు పేర్లే వినిపిస్తున్నాయి. మరి ఫైనల్ గా ఫిల్టర్ కాబడ్డ ఈ ఇద్దరిలో మహేష్ ఎవరితో సినిమా చేస్తారో అన్నది మరింత ఉత్కంఠగా మారింది. మరి ఈ సస్పెన్సుకు తెర పడాలి అంటే ఇంకొన్నాళ్ళు ఆగక తప్పదు.

సంబంధిత సమాచారం :

More