“ఆచార్య” రిలీజ్ డేట్స్ పై పెరుగుతున్న సస్పెన్స్.!

Published on Aug 4, 2021 7:04 am IST


ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో “ఆచార్య” అనే హై బడ్జెట్ మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం షూట్ ఆల్ మోస్ట్ కంప్లీట్ అయ్యిపోవచ్చింది.. అయితే ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా ఇప్పుడు రిలీజ్ కి వస్తుంది.

అయితే తాజాగా ఈ సినిమా విడుదల తేది పట్ల ఆసక్తికరమైన సస్పెన్స్ ఇప్పుడు నెలకొంది. మాములుగా అయితే ఈ సినిమా కంప్లీట్ అయ్యిన దాని ప్రకారం దసరా రేస్ లో నిలవాల్సి ఉంది. కానీ ఈ రేస్ లో ఆల్రెడీ “RRR” చిత్రం ఉంది. అయినా కూడా ఆచార్య వస్తుంది అని ఆ మధ్య టాక్ వచ్చింది. అది కాస్తా అటు ఇటుగా సెప్టెంబర్ కి వచ్చిందని కూడా వినిపించింది.

కానీ లేటెస్ట్ టాక్ ఏమిటంటే ఈ చిత్రం కూడా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలవనుంది అని తెలుస్తోంది. కాకపోతే కాస్త ముందుగా జనవరి 7న అలా ఈ చిత్రం రిలీస్ ఉండొచ్చని సినీ వర్గాలు చెబుతున్నాయి. కానీ ఇంకా ఇందులో ఎలాంటి నిజం లేదు అన్నది గుర్తు పెట్టుకోవాలి. అలాగే ఈ మధ్యలోనే ఈ డేట్ పై ఒక క్లారిటీ వస్తుందని టాక్ ఉంది. మరి మెగాస్టార్ రాక ఎప్పుడు ఉంటుందో చూడాలి..

సంబంధిత సమాచారం :