ఆహాలోకి సస్పెన్స్ థ్రిల్లర్ “నీడ”..!

Published on Jul 21, 2021 2:09 am IST

ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు, సరికొత్త కొత్త వెబ్ సిరీస్‌లతో తెలుగు ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్ అందిస్తున్న “ఆహా” మరో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీనీ మన ముందుకు తీసుకురాబోతుంది. తమిళంలో రిలీజైన సస్ప్నెస్ థ్రిల్లర్ “నిజల్” మూవీకి తెలుగానువాదం “నీడ”. ఈ సినిమా జూలై 23న ఆహాలో స్ట్రీమింగ్ కాబోతుంది. లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార, కుంచాకో బోబన్ ప్రధానపాత్రల్లో నటిస్తుండగా, అప్పు ఎన్.భట్టతిరై ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. తాజాగా చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ విడుదలైంది.

అయితే నితిన్ అనే చిన్నారి సాయంతో జాన్ అనే న్యాయమూర్తి ఒక హత్య కేసును ఎలా చేధించాడు ఛేదించే నేపథ్యంలో ఎలాంటి నిజాలు బయటపడ్డాయి? అనేది ఈ సినిమా కథాంశం. ఆసక్తికరమైన కథతో తెరకెక్కిన ఈ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ తెలుగు ప్రేక్షకులను థ్రిల్‌కి గురి చేస్తుందని ఆహా వర్గాలు అంటున్నాయి. ఇదిలాఉంటే జోసెఫ్-అభిజీత్ పిళ్లై ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు.

సంబంధిత సమాచారం :