విడుదల తేదీ : ఫిబ్రవరి 28, 2025
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
నటీనటులు : ఐశ్వర్య రాజేష్, కథిర్, లాల్, శరవణన్, గౌరీ జి కిషన్, సంయుక్త వయోల, విశ్వనాథన్, మోనిష తదితరులు
దర్శకుడు : బ్రమ్మ, సర్జున్ కే ఎం
నిర్మాణం : వాల్ వాచర్ ఫిల్మ్స్
సంగీతం : సామ్ సిఎస్
సినిమాటోగ్రఫీ : అబ్రహం జోసెఫ్
ఎడిటింగ్ : రిచర్డ్ కెవిన్
సంబంధిత లింక్స్ : ట్రైలర్
ప్రముఖ స్ట్రీమింగ్ యాప్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో మన ఇండియన్ సినిమా నుంచి కూడా సాలిడ్ కంటెంట్ ఉన్న సంగతి తెలిసిందే. మెయిన్ గా ఎన్నో హిట్ వెబ్ సిరీస్ లు ప్రైమ్ వీడియో సొంతం. ఇలా తమిళ్ నుంచి వచ్చిన హిట్ సిరీస్ లలో ‘సుళల్’ కూడా ఒకటి. పుష్కర్ – గాయత్రీలు క్రియేట్ చేసిన సీజన్ 1 మంచి హిట్ కావడంతో ఇన్నేళ్ల తర్వాత దానికి సీజన్ 2 రీసెంట్ గానే పాన్ ఇండియా భాషల్లో అందుబాటులోకి వచ్చింది. ఇక ఇదెలా ఉందో సమీక్షలో చూద్దాం.
కథ :
సీజన్ 1 ఏదైతే ఒక ఎగ్జైటింగ్ ఎండింగ్ తో ముగుస్తుందో అదే ఎండింగ్ నుంచి ఈ సీజన్ 2 కూడా మొదలవుతుంది. తన బాబాయ్ ని చంపిన కేసులో నందిని(ఐశ్వర్య రాజేష్) జైల్లోకి వెళ్లడంతో ఈ కేసుని ఎస్సై చక్రి (కథిర్) ఇన్వెస్టిగేట్ చేయడం మొదలు పెడతాడు. ఇక్కడ నుంచి మొదలైన ఈ ఇన్వెస్టిగేషన్ లో వచ్చిన మలుపులు ఏంటి? ఈ కొత్త సీజన్ లో పరిచయం అయ్యిన కొత్త పాత్రలు, కొత్త మిస్టరీలు ఎలా సాగాయి. చివరికి నందిని బయటకి వస్తుందా లేదా అనే ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకి సమాధానం తెలియాలి అంటే ఈ సిరీస్ ని ప్రైమ్ వీడియోలో చూసి తెలుసుకోవాలి.
ప్లస్ పాయింట్స్ :
క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సిరీస్ మొదటి సీజన్ ఆడియెన్స్ ని మెప్పించింది. అయితే సీజన్ 2 ని కూడా ఇదే తరహాలో నడిపించే ప్రయత్నం కనిపిస్తుంది. మెయిన్ గా ఒకో ఎపిసోడ్ లో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ లు టర్నింగ్ లు అందించే థ్రిల్స్ బాగున్నాయి అని చెప్పవచ్చు.
అలాగే ఈ సీజన్ లో టచ్ చేసిన పలు సోషల్ ఎలిమెంట్స్ కూడా ఆడియెన్స్ ని ఆలోచించేలా చేస్తాయి. ఇక నటీనటుల్లో అయితే ఐశ్వర్య రాజేష్ తన నాచురల్ పెర్ఫామెన్స్ తో ఇంప్రెస్ చేస్తుంది. తన సింపుల్ లుక్స్ పలు కీలక సన్నివేశాల్లో తన సహజ నటన నందిని రోల్ ని మరింత ఇంపాక్ట్ కలిగించేలా చేసింది.
ఇక తనతో పాటుగా తనకి కూడానే కనిపించే యువ నటుడు కథిర్ కూడా సాలిడ్ పెర్ఫామెన్స్ ని కనబరిచాడు. ఇక వీరితో పాటుగా ఇతర నటీనటులు కూడా తమ పాత్రలు పరిధి మేరకు బాగానే నటించారు.
మైనస్ పాయింట్స్ :
సుళల్ సీజన్ 1 మంచి హిట్ కావడంతో సీజన్ 2 పై మంచి అంచనాలు నెలకొన్నాయి. డెఫినెట్ గా ఒక సీక్వెల్ అంటే పార్ట్ 1 లేదా సీజన్ 1 కంటే బెటర్ ట్రీట్ ని ఆడియెన్స్ ని ఆశిస్తారు. అయితే ఈ తరహా ట్రీట్మెంట్ మాత్రం సుళల్ సీజన్ 2 లో మిస్ అయ్యినట్టుగా ఈ సిరీస్ లవర్స్ లో అనిపించక మానదు.
పలు సన్నివేశాలు రిపీటెడ్ గా కొనసాగడం, అలాగే సీజన్ 1 రేంజ్ లో థ్రిల్ మూమెంట్స్ కూడా కనిపించకపోవడంతో రెండో సీజన్ మాత్రం మరీ అంత ఎగ్జైట్ చెయ్యదు. అలాగే చాలా వరకు కథనం చాలా స్లోగా సాగుతున్నట్టుగా అనిపిస్తుంది. పైపెచ్చు ఈ కథనం కూడా ఊహాజనితంగానే సాగడం అనేది మరో మైనస్ అని చెప్పి తీరాలి.
దీనితో కొన్ని ట్విస్ట్ లు వరకు ఓకే కానీ మిగతా అంశాలు మాత్రం ఈ సీజన్ లో డిజప్పాయింట్ చేస్తాయి. ఇక ఇవి మాత్రమే కాకుండా ఒక ఎగ్జైటింగ్ క్లైమాక్స్ కూడా ఈ సీజన్ లో మిస్ అయ్యిందని చెప్పాలి. చాలా సింపుల్ గా ఈ సిరీస్ ని ముగించేసినట్టుగా ఆ క్లైమాక్స్ చూస్తే అనిపిస్తుంది. దీనితో ఆడియెన్స్ లో మాత్రం డెఫినెట్ గా సీజన్ 2 కంటే సీజన్ 1నే బెటర్ గా ఉంది అనిపించేలా చేస్తుంది. ఇంకా గ్రిప్పింగ్ నరేషన్ తో ఈ సీజన్ ఎపిసోడ్స్ ని ప్లాన్ చేయాల్సింది.
సాంకేతిక వర్గం :
గత సీజన్ లానే ఈ సీజన్ లో కూడా నిర్మాణ విలువలు బాగున్నాయి అని చెప్పవచ్చు. టెక్నికల్ గా సిరీస్ ని బాగా ప్లాన్ చేశారు. మెయిన్ గా సామ్ ని ఎస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా సన్నివేశాలకి బాగా ప్లస్ అయ్యింది. ఇక కెమెరా వర్క్ ఇంప్రెసివ్ గా ఉంది. ఎడిటింగ్ కొంచెం ఫాస్ట్ పేస్ లో కట్ చేయాల్సింది. చాలా మూమెంట్స్ డల్ గా అనిపించాయి. తెలుగు డబ్బింగ్ విలువలు బాగున్నాయి.
ఇక దర్శకులు బ్రమ్మ, సర్జున్ కేఎం విషయానికి వస్తే.. ఈసారి కూడా డీసెంట్ లైన్ ని మంచి థ్రిల్ ఎలిమెంట్స్ తో కొనసాగించే ప్రయత్నం చేశారు కానీ ఇది ఇంకా ఇంట్రెస్టింగ్ గా మలచి ఉంటే బాగుండేది. మెయిన్ గా సీజన్ 1 రేంజ్ లో ట్రీట్మెంట్ వీరి నుంచి మిస్ అయ్యినట్టుగా అనిపిస్తుంది. కొన్ని మూమెంట్స్ వరకు ఓకే కానీ మిగతా అంశాలని మాత్రం వీరు ఇంకొంచెం కేర్ తీసుకుని ఉంటే బెటర్ గా ఉండేది.
తీర్పు:
ఇక ఓవరాల్ గా చూసినట్టుగా అయితే ఈ ‘సుళల్ ది వర్టెక్స్ సీజన్ 2’ సిరీస్ మొదటి సీజన్ తో పోలిస్తే మాత్రం కొంచెం తక్కువ ట్రీట్ నే అందిస్తుంది అని చెప్పవచ్చు. సీజన్ 2 లో కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కానీ వాటికి అనుగుణంగా సాగే కథనం మాత్రం మిస్ అయ్యింది. కొంచెం కథనం వేగవంతంగా సాగించి మరిన్ని థ్రిల్ మూమెంట్స్ ని జోడించి ఉంటే ఈ సీజన్ 2 మరింత బెటర్ ట్రీట్ ని ఇచ్చి ఉండేది. సో సీజన్ 1 రేంజ్ ట్రీట్ కావాలి అనుకుంటే దొరకదు కానీ ఈ సీజన్ కొంచెం తక్కువ అంచనాలు పెట్టుకొని ఒకసారికి ట్రై చేయవచ్చు.
123telugu.com Rating: 3/5
Reviewed by 123telugu Team