వాయిదా ప‌డ్డ ఎస్వీఆర్ కాంస్య విగ్ర‌హావిష్క‌ర‌ణ‌

Published on Aug 24, 2019 9:35 am IST

విశ్వ న‌ట‌చ‌క్ర‌వ‌ర్తి కీ.శే. ఎస్వీ రంగారావు కాంస్య విగ్ర‌హాన్ని తాడేప‌ల్లి గూడెం య‌స్.వి.ఆర్. స‌ర్కిల్, కె.య‌న్.రోడ్ లో రేపు ఆదివారం ఆవిష్క‌రించేందుకు ప్రణాళిక వేసిన సంగతి తెలిసిందే. ఐతే ఈ కార్యక్రమం వాయిదాపడినట్లు తెలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఈ విగ్ర‌హావిష్క‌ర‌ణ జరగనున్నట్లు నిన్న ప్రకటించడం జరిగింది. నిర్వాహకులు ఈ మేరకు నిన్న ఓ పోస్టర్ ని విడుదల చేయడం జరిగింది.

అయితే ఈ ఆవిష్క‌ర‌ణ వాయిదా వేశామ‌ని నిర్వాహ‌కులు తెలిపారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఇంకా అనుమ‌తులు జారీ కాకపోవడమే జాప్యానికి కారణంగా తెలుస్తుంది. త్వ‌ర‌లోనే కొత్త తేదీని ప్ర‌క‌టిస్తామ‌ని నిర్వాహకులు వెల్ల‌డించారు.

సంబంధిత సమాచారం :

More