‘సూపర్’ 16 ఇయర్స్ జర్నీపై స్వీటీ అనుష్క రియాక్షన్.!

Published on Jul 22, 2021 2:51 pm IST

మన దక్షిణాది స్టార్ హీరోయిన్స్ ఎంత మంది ఉన్నా కూడా ఒక స్టాండర్డ్ తో ఫాలోయింగ్ ఉన్న అతి తక్కువ మంది స్టార్ హీరోయిన్స్ లో స్వీటీ అనుష్క కూడా ఒకరు. కింగ్ నాగార్జున మరియు మాస్ దర్శకుల కాంబోలో వచ్చిన ఆసక్తికర రాబరీ చిత్రం “సూపర్” సినిమాతో తెలుగు సినిమాకి పరిచయం అయ్యి తన సినిమాలకంటూ స్పెషల్ మార్కెట్ ని కూడా ఏర్పర్చుకుంది.

అయితే మరి వీరి కాంబోలో మొట్ట మొదటి సారిగా టాలీవుడ్ కి పరిచయం అయ్యిన స్వీటీ ఆ సినిమాతో పాటుగా తాను కూడా 16 ఏళ్ళు జర్నీ పూర్తి చేసుకుంది. దీనితో తాజాగా తన సినిమా మరియు ఈ పదహారేళ్లు జర్నీ కోసం ఆసక్తికర పెట్టింది. ‘సూపర్’ సినిమాలో తనతో భాగస్వామ్యం అయిన నాగ్, సోను సూద్, పూరి జగన్నాథ్ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ వారికి ప్రతీ ఒక్కరు తనకి సపోర్ట్ చేసి ఈ పదహారేళ్లు నమ్మి నిలిబడ్డ వారు అందరికీ స్పెషల్ థాంక్స్ చెబుతున్నాని తెలిపింది.

“అలాగే తన కోసం తమ సమయం నుంచి మాట్లాడుకున్న ప్రతీ ఒక్కరికీ మరియు ఇంతగా చూపిస్తున్న ప్రేమకు చాలా పెద్ద థాంక్స్ స్వీటీ తెలిపింది. ఇక ఇదిలా ఉండగా అనుష్క నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్సమెంట్స్ కోసం మాత్రం చాలా మందే ప్రస్తుతం చాలా మందే చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :