సైరా షూటింగ్ అప్డేట్ !

Published on Feb 17, 2019 1:03 pm IST


మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ చిత్రం ‘సైరా నర్సింహారెడ్డి’ షూటింగ్ ప్రస్తుతం హిస్టారికల్ ప్లేస్ మహాబలిపురం లోని ముదలియార్ కుప్పం లో జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో స్టంట్ మాస్టర్ విజయ్ ఆధ్వర్యంలో చిరు ఫై కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నయన తార కథానాయికగా నటింస్తుండగా అమితాబ్ , జగపతి బాబు , తమన్నా, విజయ్ సేతుపతి, సుధీప్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు. మార్చి చివర్లో షూటింగ్ పూర్తి చేసి ఆతరువాత గ్రాఫిక్స్ పనుల కోసం చాలా సమయం తీసుకొనున్నారు.

కొణిదెల ప్రొడక్షన్స్ పతాకం ఫై భారీ బడ్జెట్ తో హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈచిత్రాన్ని దసరా సీజన్ లో విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :