“సైరా” విడుదలకు ముహూర్తం కుదిరిందా…?

Published on May 23, 2019 11:24 pm IST

రాయలసీమ మొదటితరం స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం “సైరా”. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు.మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ చేస్తున్న ఈ మూవీ చిత్రీకరణ చివరి దశకి చేరుకుంది. ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్యదినం సంధర్బంగా విడుదల చేయాలని మొదట భావించిన చిత్ర యూనిట్ ,అప్పటికి అనుకున్న పనులు పూర్తికావనే ఉద్దేశంతో, అక్టోబర్ 2వ తేదీకి వాయిదా వేసిన‌ట్టు వార్తలు వస్తున్నాయి.

దర్శక నిర్మాతలు బాగా ఆలోచించి ఈ తేదీనే ఖాయం చేసుకున్నారనేది తాజా సమాచారం. చారిత్రక నేపథ్యంతో పాటు స్వాతంత్య్ర పోరాటంతో ముడిపడిన కథ కావడంతో గాంధీ జయంతి ని పురస్కరించుకొని అక్టోబర్ 2వ తేదీన విడుదల చేయాలని భావిస్తున్నారంట. ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార చేస్తుండగా, ఈ చిత్రానికి సురేంద‌ర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :

More