సైరా కోసం చైనా కు చిరు !

Published on Mar 22, 2019 8:28 pm IST

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘సైరా’ చిత్రం యొక్క షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో అమితాబ్ తన పాత్ర తాలూకు షూటింగ్ ను పూర్తి చేశారు. ఇక ఈ షెడ్యూల్ తరువాత చిత్ర బృందం తదుపరి షెడ్యూల్ కోసం చైనా వెళ్లనున్నారు. సుమారు 20 రోజుల పాటు జరుగనున్న ఈ షెడ్యూల్ లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తికానుంది. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్నఈ చిత్రంలో నయన తార కథానాయికగా నటిస్తుండగా సుధీప్ , జగపతి బాబు , విజయ్ సేతుపతి , తమన్నా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది స్వరాలు సమకూరుస్తున్నారు. భారీ బడ్జెట్ తో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈఏడాది ద్వితీయార్థంలో విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :

More