చైనాలో సైతం విడుదలకానున్న ‘సైరా’ !
Published on Mar 9, 2018 9:12 am IST

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న పిరియాడికల్ డ్రామా ‘సైరా నరసింహారెడ్డి’. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని చైనాలో కూడ విడుదలచేయాలనుకుంటున్నారట మెగా టీమ్. అంతేగాక చిత్రంలోని కొంత భాగాన్ని చైనాలోనే షూట్ చేస్తారట. ‘సీక్రెట్ సూపర్ స్టార్, దంగల్, భజరంగీ భాయిజాన్’ వంటి ఇండియన్ సినిమాలు చైనాలో విడుదలై ఘన విజయాన్ని అందుకోవడంతో ‘సైరా’ కూడ అక్కడి ప్రేక్షకుల్ని అలరిస్తుందనే నమ్మకంతో ఈ నిర్ణయం తీసుకున్నారట.

పైగా చైనాలో చిత్రీకరణ జరుపుకునే ఫారిన్ సినిమాలకు అక్కడి ప్రభుత్వం మంచి డిస్కౌంట్లు కూడ అందిస్తోందట. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ సినిమా త్వరలోనే రెండవ షెడ్యూల్ ను మొదలుపెట్టుకోనుంది. రామ్ చరణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార, అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి వంటి స్టార్లు నటిస్తున్నారు.

 
Like us on Facebook