సైరా లేటెస్ట్ కలెక్షన్స్ రిపోర్ట్

Published on Oct 10, 2019 12:08 pm IST

సైరా నరసింహారెడ్డి వసూళ్ల హవా కొనసాగుతూనే ఉంది. పండగ దినాలను పరిపూర్ణంగా ఉపయోగించుకున్న సైరా రికార్డు వసూళ్లు సాధించడమే కాకుండా తెలుగు రాష్ట్రాలలో నాన్ బాహుబలి రికార్డు సొంతం చేసుకుంది. ఎనిమిది రోజులకు గాను సైరా రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి 90కోట్ల షేర్ రాబట్టింది. ఎనిమిదవరోజు కూడా నైజాంలో సైరా 2.47 కోట్ల షేర్ సాధించడం చిరు సత్తాని చాటుతుంది.

ఇక దసరా సెలవలు ముగిసినప్పటికీ రేపటి నుండి వీకెండ్ మొదలుకావడంతో పాటు, పెద్ద చిత్రాల విడుదల లేకపోవడంతో సైరా మెరుగైన వసూళ్లు సాధించే అవకాశం కలదు. ఐతే సోమవారం నుండి సైరాకి అసలు పరీక్ష మొదలవుతుంది. ఏదిఏమైనా ఈ మూడురోజులలోనే సైరా వసూళ్లు కొనసాగే అవకాశం కలదు. చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గా చేసిన ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మించగా, సురేంధర్ రెడ్డి దర్శకత్వం వహించారు.

సంబంధిత సమాచారం :

X
More