అమెజాన్ ప్రైమ్‌ లో సైరా సినిమా..!

Published on Nov 21, 2019 9:25 pm IST

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా, న‌య‌న‌తార హీరోయిన్‌గా కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై రామ్ చ‌ర‌ణ్ నిర్మాతగా అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెరకెక్కించిన చిత్రం సైరా న‌ర‌సింహారెడ్డి. అయితే తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో అమితాబ్ బ‌చ్చ‌న్, విజ‌య్ సేతుప‌తి, సుదీప్‌, జ‌గ‌ప‌తి బాబు కూడా ప్రధాన పాత్రలలో నటించగా ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా అక్టోబర్ 2న గాంధీజయంతి సందర్భంగా విడుదలై మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడు ఈ మూవీని నేటి నుంచి ఆన్‌లైన్‌లో హెచ్‌డీ ప్రింట్ ద్వారా అందుబాటులో ఉంటుందని అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ప్రకటించింది. అయితే ప్రస్తుతం సైరా సినిమా తెలుగు, తమిళ్‌, కన్నడ, మళయాళం వెర్షన్లను ఆన్‌లైన్‌లో వీక్షించవచ్చు. హిందీ వెర్షన్‌ మాత్రం త్వరలోనే ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురానునట్టు ప్రకటించారు.

సంబంధిత సమాచారం :