సమాజం కోసం మరో మారు ముందడుగేసిన హీరోయిన్ !
Published on Apr 1, 2017 9:54 am IST


తాప్సి సందర్భం వచ్చినప్పుడల్లా సమాజం కోసం తన గళం వినిపిస్తూ ఉంటుంది. కాగా మరో మారు ఈ స్టార్ హీరోయిన్ ఓ సామాజిక కార్యక్రమం కోసం హైదరాబాద్ పోలీస్ లతో చేతులు కలపనుంది.బాలికలపై జరుగుతున్న లైంగిక దాడులకు వ్యతిరేకంగా తాప్సి ఓ షార్ట్ ఫిల్మ్ లో నటించనుంది.

హైదరాబాద్ కు చెందిన ఫిల్మ్ మేకర్ విషి టెకీ రేణు నిమిషాల నిడివి గల సార్ట్ ఫిల్మ్ ని బాలికల పై జరుగుతున్న లైంగిక దాడుల విషయంలో చైతన్యం కోసం తీయనున్నారు. దీనికి హైదరాబాద్ పోలీస్ ల సహకారం లభించనుంది. ప్రస్తుతం యువతకు తాప్సి రోల్ మోడల్ అని విషి టెకీ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.

 
Like us on Facebook