“మిషన్ ఇంపాజిబుల్”లో తాప్సీ ఇంట్రెస్టింగ్ రోల్..!

Published on Jul 22, 2021 3:00 am IST

దాదాపు 3 సంవత్సరాల తర్వాత హీరోయిన్ తాప్సీ టాలీవుడ్ రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఫేం స్వ‌రూప్ ఆర్జే డైరెక్ట్ చేస్తున్న చిత్రం “మిషన్ ఇంపాజిబుల్‌”లో తాప్సీ నటిస్తున్నట్టు ఇదివరకే ప్రకటించింది. మ్యాటినీ ఎంటర్టైన్మెంట్స్ నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో తాప్సీ ఇంట్రెస్టింగ్ రోల్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

అయితే తిరుప‌తిలో బౌంటీ హంట‌ర్స్ (డ‌బ్బులు తీసుకుని చంపే రౌడీలు) కథ ఆధారంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో తాప్సీ తిరుప‌తికి చెందిన జ‌ర్న‌లిస్టుగా క‌నిపించ‌నుంద‌ని టాక్‌. అంతేకాదు ఇందులో తాప్సీ పాత్ర చుట్టూ చాలా ఆసక్తి నెలకొంటుందని, ఈ మూవీలో తాప్సీ చేస్తున్న రోల్ మెయిన్ హైలెట్‌గా నిలుస్తుందని ఫిల్మ్ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతుంది.

సంబంధిత సమాచారం :