ఇది ఎంతో గర్వపడాల్సిన సమయం – టబు

Published on Jul 18, 2021 8:53 pm IST

సీనియర్ స్టార్ హీరోయిన్ టబు హీరోయిన్‌ గా తన సినీ కెరీర్‌ మొదలుపెట్టి నేటికి 30 సంవత్సరాలు పూర్తవడం విశేషం. అన్నట్టు తన సినీ జర్నీ గురించి టబు తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వెల్లడిస్తూ.. ‘‘నేను హీరోయిన్గా కెరీర్‌ మొదలుని పెట్టి అప్పుడే 30 సంవత్సరాలు గడిచిపోయాయా!! అవును, నా కెరీర్ పట్ల నేనే నమ్మలేకపోతున్నాను’’ అంటూ షాకింగ్ ఎక్స్ ప్రెషన్ పెట్టింది.

టబు హీరోయిన్ గా నటించిన మొదటి సినిమా ‘కూలీ నం.1’. కాగా ఈ సినిమా విడుదలై ఈ నెల 12వ తేదీకి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇన్‌స్టాలో ‘కొత్త కొత్తగా ఉన్నది’ పాటను షేర్‌ చేసింది టబు. ఈ పాటతో పాటు ఒక మెసేజ్ కూడా పోస్ట్ చేస్తూ.. ‘ఇది ఎంతో గర్వపడాల్సిన సమయం. చాలారకాల భావోద్వేగాలు కలుగుతున్నా ముఖ్యంగా నా మనసులో మెదిలేది కృతజ్ఞత. నన్ను హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయం చేసిన డి.రామానాయుడు, సురేష్‌బాబు, హీరో వెంకటేష్‌తో పాటు నా గురువు, దర్శకుడు కె.రాఘవేంద్రరావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఆయన నన్ను తెరపై అందమైన కలలా చూపించడమే కాదు ఎన్నో జీవిత పాఠాలు నేర్పారు’’ అంటూ టబు చెప్పుకొచ్చింది.

సంబంధిత సమాచారం :