టబు క్యారెక్టర్ కొత్తగా ఉంటుందట !

టబు క్యారెక్టర్ కొత్తగా ఉంటుందట !

Published on Apr 17, 2019 2:00 AM IST

దర్శకుడు ‘వేణు ఉడుగుల’ దర్శకత్వంలో రానా సాయిప‌ల్ల‌వి హీరోహీరోయిన్ లుగా ‘విరాటపర్వం’ అనే రాజ‌కీయ నేప‌థ్యంలో సాగే ల‌వ్ స్టోరీని తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం ఈ చిత్రం స్క్రిప్ట్ కు మెరుగులు దిద్దే పనిలో ఉన్నాడు వేణు. ఇక జులై నుంచి సెట్స్‌ పైకి వెళ్ళనుంది. కాగా ఈ చిత్రంలో ఓ కీల‌క‌మైన పాత్ర‌లో ట‌బు నటిస్తోంది.

రాజ‌కీయ నేప‌థ్యంలో సాగే ఈ సినిమాలో ట‌బు మాన‌వ హ‌క్కుల నేత‌గా నటిస్తోంది. తన పాత్ర గురించి విన్న వెంటనే ఈ సినిమా చెయ్యడానికి టబు ఏం ఆలోచించకుండా వెంటనే అంగీకరించిందట. టబు పాత్ర సినిమాలో చాలా కొత్తగా ఉంటుందని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు