అల వైకుంఠాపురంలో నుండి బ్రేక్ తీసుకున్న టబు

Published on Nov 15, 2019 3:00 am IST

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా కొనసాగిన టబు ప్రస్తుతం వయసుకుదగ్గ ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తుంది. గత ఏడాది అంధాదున్ అనే అవార్డు విన్నింగ్ మూవీలో నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేసిన టబు ఈ ఏడాది ‘దే దే ప్యార్ దే’ చిత్రంలో అజయ్ దేవ్ గణ్ భార్య పాత్ర చేసింది. కాగా టబు తెలుగులో చివరి సారిగా 2008లో బాలకృష్ణ హీరోగా వచ్చిన పాండు రంగడు చిత్రంలో కనిపించారు. ఇన్నేళ్ల తరువాత అల వైకుంఠపురంలో కీలక పాత్ర చేస్తున్నారు.

కాగా టబు ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ నుండి బ్రేక్ తీసుకున్నారట. పాటల చిత్రీకరణ కొరకు టీమ్ సభ్యులు ఫ్రాన్స్ వెళ్లడంతో టబుకి బ్రేక్ దొరికిందట. ఈ గ్యాప్ లో టబు భోల్ బులియ్య 2 చిత్ర షూటింగ్ లో పాల్గొంటున్నారట.
కార్తీక్ ఆర్యన్, కియారా అద్వానీ జంటగా నటించిన ఈచిత్రాన్ని దర్శకుడు అనీష్ బాజ్మీ తెరకెక్కిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More