ప్రియదర్శి తో నెక్స్ట్ మూవీ చేయనున్న టాలెంటెడ్ డైరెక్టర్

ప్రియదర్శి తో నెక్స్ట్ మూవీ చేయనున్న టాలెంటెడ్ డైరెక్టర్

Published on Feb 29, 2024 9:26 PM IST

2004లో గ్రహణం మూవీతో దర్శకుడిగా మెగాఫోన్ పట్టిన ఇంద్రగంటి మోహన కృష్ణ, ఆ తరువాత మాయాబజార్, అష్ట చమ్మా, గోల్కొండ హై స్కూల్ వంటి సినిమాలతో మంచి విజయాలు అందుకున్నారు. ఇక ఇటీవల సుధీర్ బాబు, కృతి శెట్టి ల కలయికలో ఈ టాలెంటెడ్ డైరెక్టర్ తీసిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ మంచి విజయం అందుకుంది.

విషయం ఏమిటంటే, యువ నటుడు, కమెడియన్ ప్రియదర్శితో తన నెక్స్ట్ మూవీని చేయనున్నారు ఇంద్రగంటి. ప్రముఖ సంస్థ శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణప్రసాద్ గ్రాండ్ గా నిర్మించనున్న ఈ మూవీ యొక్క షూటింగ్ మార్చి నెలాఖరు నుండి ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. అతి త్వరలో ఈ ప్రాజక్ట్ గురించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది. విశేషం ఏమిటంటే, శ్రీదేవి మూవీస్ బ్యానర్ లో ఇంద్రగంటికి ఇది మూడవ మూవీ కావడం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు