‘బన్నీ’తో చెయ్యట్లేదట.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ !

Published on May 22, 2019 4:00 pm IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కలయికలో వస్తోన్న సినిమాలో హీరోయిన్ నివేతా థామస్ నటిస్తోందని కొన్ని రోజులుగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ సినిమాలో ఎమోషన్నే హైలెట్ చేస్తూ.. బన్నీ కోసం మంచి సిస్టర్ సెంటిమెంట్ కథ రాశారని సిస్టర్ గా నివేతా నటిస్తోందని కాస్త గట్టిగానే రూమర్స్ వచ్చాయి. మొత్తానికి ఆ రూమర్స్ కి ఫుల్ స్టాప్ పెట్టింది నివేతా. బన్నీ సినిమాలో నటించమని తనను ఎవరూ సంప్రదించలేదని క్లారిటీ ఇచ్చింది.

ఈ సినిమాలో కొత్త బన్నీ కనిపించేలా త్రివిక్రమ్ జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇక ఈ సినిమలో బన్నీసరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. పూజా హెగ్డే ఇప్పటికే త్రివిక్రమ్ తో ‘అరవింద సమేత’కి, అలాగే బన్నీతో డీజే సినిమాకి పనిచేసింది. అలాగే ఈ సినిమాలో సుశాంత్, నవదీప్ లు కూడా నటిస్తున్నారు. అన్నిటికి మించి ఈ చిత్రంలో అల్లు అర్జున్ కి తల్లిగా ఒకప్పటి హాట్ హీరోయిన్ టబు నటిస్తోంది. ఈ సినిమాను అల్లు అరవింద్ తో కలిసి చినబాబు నిర్మించనున్నారు.

సంబంధిత సమాచారం :

More