తెలుగు సినిమా పై ఆసక్తి చూపిస్తోన్న టాలెంటెడ్ హీరోయిన్ !

Published on May 26, 2019 1:00 pm IST

టాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ మన తెలుగు అమ్మాయే అన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు తమిళ చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న ఐశ్వర్య రాజేష్ మొదటిసారి డైరెక్ట్ గా చేస్తోన్న తెలుగు సినిమా ‘కౌసల్య కృష్ణమూర్తి..ది క్రికెటర్‌’. కాగా ఈ సినిమా పట్ల చాలా ఇనెట్రస్టింగ్ గా ఉన్నానని తెలుగు సినిమాలో నటిస్తోన్నందుకు చాలా అనంద పడుతున్నానని ఐశ్వర్య రాజేష్ వ్యక్తపరుస్తోంది.

ఇక నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్‌, కార్తీక్‌ రాజు, వెన్నెల కిషోర్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తోన్న ఈ సినిమాను భీమనేని శ్రీనివాసరావు తెరకెక్కిస్తోన్నారు. క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూన్‌లో చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు.

కాగా విలేజ్‌ బ్యాక్‌ డ్రాప్‌లో లేడీ క్రికెటర్‌ కథాంశంతో వస్తున్న ఈ విభిన్న చిత్రం అన్నివర్గాల ఆడియన్స్‌ని అలరిస్తుందట. పైగా ఈ కథలో రైతుల సమస్యలను కూడా టచ్‌ చేస్తున్నారు. ఇక తమిళ హీరో శివ కార్తికేయన్‌ ఈ సినిమాలో ఓ స్పెషల్‌ రోల్‌ చేయడం విశేషం.

సంబంధిత సమాచారం :

More