టాక్..ఎన్టీఆర్ కోసం ఐకాన్ స్టార్..?ఎంతవరకు నిజం?

టాక్..ఎన్టీఆర్ కోసం ఐకాన్ స్టార్..?ఎంతవరకు నిజం?

Published on Jan 28, 2022 9:32 PM IST

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన భారీ సినిమా “రౌద్రం రణం రుధిరం” కంప్లీట్ చేసి గ్యాప్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ గ్యాప్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు తన నెక్స్ట్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించనున్న తన 30వ ప్రాజెక్ట్ కి రెడీ అవుతున్నాడు.

మరి ఎప్పుడో ఆ సినిమా కోసం తన లుక్ ని మరియు మేకోవర్ ని మార్చేసుకున్న తారక్ ఇప్పుడు ఈ సినిమా స్టార్టింగ్ కోసం ఎదురు చూస్తున్నాడు. మరి ఇదిలా ఉండగా వచ్చే ఫిబ్రవరి మొదటి వారంలోనే ఈ సినిమా ముహూర్తం ఉండనుంది అని సినీ వర్గాల్లో టాక్ రాగా ఇపుడు ఇంకో ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తుంది.

ఈ సినిమా ఓపెనింగ్ కి గాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా హాజరు కానున్నాడని టాక్. మరి ఇందులో ఎంతమేర నిజముందో అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఆల్రెడీ బన్నీ, తారక్ లకి మంచి బాండింగ్ ఉన్న సంగతి తెలిసిందే. అలానే బన్నీ కూడా కొరటాలతో ఒక సినిమా చెయ్యాల్సి ఉంది. మరి ఈ అన్నిటితో నిజంగానే బన్నీ తారక్ కోసం వస్తాడో లేదో చూడాలి మరి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు