నితిన్ తో తమన్నా ప్రమోషనల్ సాంగ్ !

Published on Jul 18, 2021 10:51 pm IST

తమన్నా ప్రస్తుతం నితిన్ చేస్తోన్న ‘మాస్ట్రో’ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా గురించి ఒక లేటెస్ట్ అప్ డేట్ ఏమిటంటే.. ఈ సినిమా కథకు కథనంకు సంబంధం లేకపోయినా, తమన్నా పై ఒక ప్రమోషనల్ సాంగ్ ను షూట్ చేస్తున్నారు. ఈ సాంగ్ కోసం ఇప్పటికే రామోజీ ఫిల్మ్‌ సిటీలో భారీ ఎత్తున ఒక సెట్ కూడా వేశారట.

కాగా ఈ సెట్ లోనే తమన్నా – నితిన్ ఈ ప్రమోషనల్‌ సాంగ్‌ ను చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతానికి అయితే తమన్నా చేతిలో ఇంకా ఎఫ్‌ 3 మరియు సిటీ మార్ లాంటి సినిమాలు ఉన్నాయి. అలాగే ‘గుర్తుందా శీతాకాలం’ అనే చిన్న సినిమాలోనూ తమన్నా నటిస్తోంది. ఈ సినిమాల్లో ఏది హిట్ అయినా మళ్ళీ తమన్నాకు వరుస అవకాశాలు వచ్చే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం :