రాజమౌళిపై తమన్నా కీలక వ్యాఖ్యలు..!

Published on Jul 3, 2020 3:51 pm IST

దర్శక ధీరుడు రాజమౌళిపై తమన్నా ప్రశంసల వర్షం కురిపిస్తుంది. రాజమౌళి భారీ బడ్జెట్ మూవీ బాహుబలిలో తమన్నా హీరోయిన్ గా చేసింది. బాహుబలి మొదటి పార్ట్ లో తమన్నా ప్రధాన హీరోయిన్ గా చేసింది. ఈ మూవీలో మరో హీరోయిన్ అనుష్క హీరోయిన్ గా చేయగా…ఫస్ట్ పార్ట్ లో తమన్నాదే కీలక రోల్. కాగా తాజా ఇంటర్వ్యూలో రాజమౌళి గురించి ఆసక్తి కర వ్యాఖ్యలు ఆమె చేశారు. బాహుబలి లాంటి పాన్ ఇండియాలో తనకు హీరోయిన్ గా అవకాశం ఇచ్చినందుకు ఆమె ధన్యవాదాలు తెలిపారు

రాజమౌళి గురించి తమన్నా మాట్లాడుతూ.. ఒకసారి తనతో పనిచేశారు కదా అని నటీనటులకు ఆయన మరో అవకాశం ఇవ్వరు. తను అనుకున్న పాత్రకు ఎవరైతే కరెక్ట్‌గా సరిపోతామని భావిస్తేనే రాజమౌళి నటీనటులకు అవకాశం ఇస్తారని తమన్నా వెల్లడించారు. ఒకవేళ ఎవరికైనా ఆయన దగ్గరి నుంచి ఫోన్ వచ్చిందంటే.. ఆ పాత్ర కచ్చితంగా వారికి రాసినట్లే అని తమన్నా తెలిపారు. ప్రస్తుతం తమన్నా గోపిచంద్‌ సరసన సిటీమార్‌లో, హిందీలో నవాజుద్దీన్ సరసన బోలే చుడియాన్‌లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More