తమన్నా భయపడుతోంది.. సక్సెస్ దక్కుతుందా ?

Published on May 11, 2019 12:00 am IST

బాలీవుడ్ పరిశ్రమలో ఒక్కసారైనా మెరవాలనేది హీరోయిన్ల ఆశ. మిల్కీ బ్యూటీ తమన్నాకు కూడా ఆ ఆశ ఉంది. అందుకే ‘హిమ్మత్ వాలా’ చిత్రంతో ఒక ప్రయత్నం చేసింది. కానీ అది సత్పలితాన్ని ఇవ్వలేదు. అందుకే ఆమె ఈసారి కొంచెం భిన్నంగా ట్రై చేయాలనే ఉద్దేశ్యంతో సైకో హర్రర్ డ్రామాను చూజ్ చేసుకుంది. అదే ‘ఖామోషి’. ఈ చిత్ర టీజర్ ఈరోజే విడుదలైంది.

ఇందులో తమన్నా మాటలు వినబడని యువతి పాత్రలో నటించింది. ఇక ప్రతినాయకుడిగా ప్రభుదేవా చేశాడు. టీజట్ చూస్తే ఒక ఒంటరి అమ్మాయిని చెరపట్టాలని చూసే సైకో.. ప్రాణాలు పోయే భయంతో అతని నుండి తప్పించుకోడానికి శాయశక్తులా ప్రయత్నించే అమ్మాయి అనేది సినిమా థీమ్ అని అర్థమవుతోంది. దర్శకుడు చక్రి తోలేటి టీజర్లో కొన్ని థ్రిల్లింగ్ షాట్స్ పెట్టి అక్కడక్కడా మెరుపులు మెరిపించాడు.

కానీ కథ పరంగా చూస్తే ఇదేమీ కొత్త కథ కాదు. ఇలాంటి సినిమాల్ని చాలానే చూశారు హిందీ ప్రేక్షుకులు. వారిని మెప్పించాలంటే డైరెక్టర్ చక్రి టేకింగ్ పరంగా సినిమాలో ఏదైనా మ్యాజిక్ చేసుండాలి. అలా అయితేనే కంటెంట్ పాతదైనా కనెక్ట్ అవుతుంది. మరి ఆయన ఆ మ్యాజిక్ చేశాడా.. అది తమన్నాకు సక్సెస్ ఇస్తుందా అనేది మే 17న సినిమా విడుదలతో తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :

More