“ప్లాన్ A ప్లాన్ B” చిత్రం ఫస్ట్ లుక్ ను షేర్ చేసిన తమన్నా!

Published on Aug 16, 2021 2:40 pm IST


తమన్నా భాటియా హీరోయిన్ గా, రితేష్ దేష్ ముఖ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ప్లాన్ A ప్లాన్ B. ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ తాజాగా ప్రకటించడం జరిగింది. రితేష్ దేశ్ ముఖ్ కి ఇది తోలి డిజిటల్ చిత్రం కావడం విశేషం. ఈ చిత్రానికి శశాంక్ ఘోష్ దర్శకత్వం వహిస్తున్నారు. రొమాంటిక్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను నటి తమన్నా సోషల్ మీడియా లో షేర్ చేయడం జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తమన్నా బుల్లితెర పై ఇప్పటికే ఒక షో చేసేందుకు సిద్దం అవుతున్నారు. మాస్టర్ చెఫ్ గా వస్తున్న ఈ కార్యక్రమం కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తమన్నా మరొక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ప్రకటించడం తో ప్రేక్షకులు, అభిమానులు ప్లాన్ A ప్లాన్ B పై ఆసక్తి కనబరుస్తున్నారు.

సంబంధిత సమాచారం :