వాయిదాపడిన తమన్నా సినిమా !

Published on May 25, 2019 3:00 am IST

సౌత్ స్టార్ హీరోయిన్ తమన్నా బాలీవుడ్లో రెండో ప్రయత్నంగా చేసిన చిత్రం ‘ఖామోషి’. చక్రి తోలేటి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ముందుగా మే 31న విడుదలచేయాలని నిర్ణయించారు. కానీ ఇప్పుడు ఆ తేదీని జూన్ 14కు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఈ వాయిదాకు కారణం సినిమాలో విఎఫ్ఎక్స్ ఎక్కువగా ఉండటమేనని, వాటిని పూర్తిచేయడం కోసమే టీమ్ ఈ వాయిదా నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.

ఈ సైకో హర్రర్ డ్రామాలో తమన్నా మాట, వినికిడి లోపం ఉన్న పాత్రలో నటించగా సైకో పాత్రలో ప్రభుదేవా నటించారు. ఈ సినిమా తమిళ వెర్షన్లో నయనతార నటించడం జరిగింది. దాన్ని కూడా జూన్ 14కు వాయిదావేశారు. ఇకపోతే తమన్నా, ప్రభుదేవాలు నటించిన మరొక చిత్రం ‘అభినేత్రి 2’ ఈ నెల 31న తెలుగు, తమిళ భాషల్లో విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :

More