రిలీజ్ కి రెడీ అయిన తమన్నా కొత్త వెబ్ సిరీస్ “జీ కర్దా”

Published on Jun 2, 2023 10:39 pm IST

స్టార్ నటి తమన్నా భాటియా తదుపరి మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్‌లో కనిపించనుంది. ఆమె 11th అవర్ మరియు నవంబర్ స్టోరీ అనే రెండు వెబ్ షోలలో కూడా నటించింది. ఇప్పుడు నటి యొక్క కొత్త వెబ్ సిరీస్ జీ కర్దా జూన్ 15న ప్రైమ్ వీడియోలో వచ్చేందుకు సిద్ధంగా ఉంది. తమన్నాతో పాటు, ఆషిమ్ గులాటీ, అన్యా సింగ్, సుహైల్ నయ్యర్, సయాన్ బెనర్జీ, హుస్సేన్ దలాల్ మరియు సంవేద సువాల్కా కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ వెబ్ సిరీస్ 30 ఏళ్లు వచ్చేసరికి తమ జీవితాలు స్థిరపడతాయని భావించే స్నేహితుల గురించి. అది తప్పు అని వారు తెలుసుకుంటారు. జీ కర్దా కి అరుణిమా శర్మ రచన మరియు దర్శకత్వం వహించడం జరిగింది. మడాక్ ఫిల్మ్స్‌ పై దినేష్ విజన్ నిర్మించారు. జీ కర్దా ఎనిమిది ఎపిసోడ్‌లను కలిగి ఉంటుంది. ఈ ప్రదర్శనలో రిలేషన్స్, హార్ట్ బ్రేక్స్ మరియు స్నేహం గురించి ఉండనుంది.

సంబంధిత సమాచారం :