‘సైరా’లో తమన్నా పాత్ర పై ఇంట్రస్టింగ్ న్యూస్ ?

Published on May 7, 2019 5:13 pm IST

మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం తుది దశలో ఉంది. కాగా ఈ చిత్రంలో మిల్క్ బ్యూటీ తమన్నా కూడా ఓ కీలక పాత్రలో నటిస్తోన్న విషయం తెలిసిందే. అయితే తమన్నా పాత్ర గురించి తాజాగా ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ తెలిసింది. తమన్నా సైరాలో ఓ రాణిగా నటిస్తోందట. పైగా తమన్నా పోషిస్తోన్న పాత్రకు కాస్త నెగిటివ్ టచ్ కూడా ఉంటుందని తెలుస్తోంది.

కాగా ఇప్పటికే తమన్నా పుట్టినరోజున నాడు. సైరా చిత్రబృందం ఆమె లుక్ ని రివీల్ చేస్తూ విడుదల చేసిన పోస్టర్ లో సాంప్రదాయ వస్త్రధారణలో మరియు అలంకరణలతో ఉన్న తమన్నా లుక్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. ఇక బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో నయన తార, విజయ్ సేతుపతి, సుధీప్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకం ఫై భారీ బడ్జెట్ తో హీరో రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More