లిప్ లాక్ చేయకూడదనేది నా రూల్ అంటున్న మిల్కీ బ్యూటీ

Published on Nov 12, 2019 9:00 pm IST

స్టార్ హీరోయిన్ తమన్నా దక్షిణాదిన ఉన్న స్టార్ దాదాపు స్టార్ హీరోలు అందరితో నటించేసింది. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి యొక్క ‘సైరా’ చిత్రంలో అద్బుతమైన నటన కనబర్చి మెప్పించిన ఆమెకు ఆఫర్లు కూడా పెరిగాయి. సౌత్ పరిశ్రమలో దాదాపు 14 ఏళ్ల కెరీర్ కలిగిన తమన్నా ఆరంభం నుండి ఇప్పటివరకు ఒక నియమాన్ని మాత్రం కఠినంగా ఫాలో అవుతూ వచ్చిందట.

ఇంతకీ ఆ నియమం ఏమిటనుకుంటున్నారా.. అదే లిప్ లాక్ కండిషన్. ఆన్ స్క్రీన్ మీద అసలు అధర చుంభనం చేయకూడదని రూల్ పెట్టుకున్న ఆమె అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ నియామాన్ని పాటిస్తూనే ఉందట. ఇకమీదట కూడా దాన్ని బ్రేక్ చేయకుండా అలాగే కొనసాగిస్తానని చెబుతోంది ఈ మిల్కీ బ్యూటీ.

ప్రస్తుతం ఆమె విశాల్ తో కలిసి నటించిన ‘యాక్షన్’ అనే చిత్రం ఈ నెల 15న తమిళంతో పాటు తెలుగులో కూడా భారీ ఎత్తున విడుదలకానుంది. అలాగే మహేష్ యొక్క ‘సరిలేర నీకెవ్వరు’ చిత్రంలో ఒక స్పెషల్ సాంగ్ చేస్తున్న ఆమె ఇంకొన్ని ప్రాజెక్ట్స్ ఓకే చేసే ఆలోచనలో ఉంది.

సంబంధిత సమాచారం :

X
More