సినిమా కోసం గాయాలపాలైన తమన్నా !

ప్రస్తుతం స్టార్ హీరోయిన్ తమన్నా తెలుగులో కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందుతున్న ‘నా నువ్వే’ అనే సినిమాలో నటిస్తోంది. కొత్త తరహా రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఉంటుందని చెప్పబడుతున్న ఈ చిత్రంలో తమన్నా రేడియో జాకీగా కనబడనుంది. ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన పాట ఉంటుందట. ఇంతవరకు తెలుగు సినిమాల్లో చూడాలని విధంగా ఉంటుందట ఈ సాంగ్.

దీని కోసం తమన్నా టాంగో అనే డాన్స్ ను నేర్చుకుంది. అలా నేర్చుకునేప్పుడు గాయాలు కూడా అయ్యాయని, ఆ డ్యాన్స్ అంత సులభమైంది కాదని, బృందా మాస్టర్ సహాయంతో పర్ఫెక్ట్ గా నేర్చుకున్నానని సినిమా కోసం తానెంత కష్టపడింది చెప్పుకొచ్చారు తమన్నా. ప్రముఖ సినిమాటోగ్రఫర్ పిసి. శ్రీరామ్ కెమెరా వర్క్ అందిస్తున్న ఈ చిత్రాన్ని జయేంద్ర డైరెక్ట్ చేస్తున్నారు.