వాల్మీకి లో కోలీవుడ్ యంగ్ హీరో ?

Published on Feb 17, 2019 11:59 am IST


డీజే తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న డైరెక్టర్ హరీష్ శంకర్ ఎట్టకేలకు తన కొత్త చిత్రాన్ని మొదలుపెట్టనున్నాడు. కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘జిగర్తండా’ ను హరీష్ తెలుగులో రీమేక్ చేయనున్నాడు. ఈనెల 21 నుండి ఈ చిత్రం యొక్క షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాకి ‘వాల్మీకి’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇక ఒరిజినల్ వెర్షన్ లో బాబీ సింహ పోషించిన పాత్రలో వరుణ్ తేజ్ నటించనుండగా సిద్దార్థ పాత్రకి శ్రీ విష్ణు కానీ నాగ శౌర్య ను తీసుకుంటారనే ప్రచారంజరిగింది. కానీ ఇప్పుడు ఈ పాత్రకు తమిళ యువ హీరో అథర్వ మురళి ని పేరును పరిశీలిస్తున్నారని టాక్. అయితే త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.

ఇక ఈ చిత్రానికి కథానాయిక ను కూడా ఎంపిక చేయాల్సి వుంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ నిర్మించనున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. ఈచిత్రం ఈ ఏడాది చివర్లో విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :