విలన్ పాత్రలో కనిపించనున్న తమిళ హీరో !
Published on Feb 28, 2018 7:17 pm IST

నిరుప్‌ భండారి, ఆర్య, రానా, అవంతిక శెట్టి, రవిశంకర్‌ కీలక పాత్రల్లో నటించిన సినిమా రాజరధం. ఈ సినిమాలో కీలకంగా కనిపించనున్న ఒక బస్సు కి రానా డబ్బింగ్ చెప్పడం జరిగింది, ఈ చిత్రానికి అనూప్ బండారి దర్శకత్వం వహించారు. మర్చి 23న ఈ సినిమా విడుదల కానుందని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించారు. మొదట ఈ సినిమాను జనవరి 25న విడుదల చెయ్యాలని భావించారు. కాని అనివార్య కారణాల వల్ల సినిమా వాయిదా పడింది.

జాలీ హిట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమా టెక్నికల్ గా హై స్టాండేడ్స్ లో తెరకెక్కించడం జరిగింది. విలియమ్ డేవిడ్ సినిమాటోగ్రఫి అందించిన ఈ సినిమాకు సుధాకర్ సాజ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఈ చిత్రంలోని అన్ని పాటలను రామజోగయ్యశాస్త్రి రచించడం జరిగింది. తమిళ హీరో ఆర్యా ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు.

 
Like us on Facebook