‘అచ్చ తెలుగు టైటిల్’ పెట్టుకున్న తమిళ్ సినిమాకి పాట పాడిన హీరో !

Published on Sep 15, 2018 9:10 am IST

‘జర్నీ’, ‘రాజా రాణీ’ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైయ్యాడు తమిళ యువ హీరో ‘జై’. తాజాగా ‘జై’ నటిస్తున్న చిత్రానికి అచ్చ తెలుగు టైటిల్ ‘జరుగండి’ అని పెట్టిన విషయం తెలిసిందే. తెలుగు టైటిల్ పెట్టిన ఈ చిత్రాన్ని ఒక్క తమిళంలో మాత్రమే చిత్రీకరిస్తుండటం విశేషం. కాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. ఈ చిత్రంలో ఈ చిత్ర హీరో ‘జై’ స్వయంగా ఓ పాట పాడారట.

‘అనుకున్నది చేసెయ్‌. మొదలు పెట్టింది పూర్తిగా ముగించెయ్‌’ అని సాగే ఈ స్ఫూర్తి గీతాన్ని జై చాలా చక్కగా పాడారని చిత్రబృందం చెబుతుంది. ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్న బోబో శశి ప్రోత్సాహాంతోనే నేను ఈ పాట ఇంత చక్కగా పాడగలిగానని జై చెప్పుకొచ్చారు.

ఇక ఈ చిత్రానికి ‘జరుగండి’ అని అచ్చ తెలుగు టైటిల్ పెట్టడానికి కారణం, దర్శకుడు గతంలోనే వివరించారు. ఈ ‘జరుగండి’ అనే పదానికి అర్ధం తమిళ వాళ్లకి కూడా చాలామందికి తెలుసు అని, అందుకే అచ్చ తెలుగు పదాన్ని టైటిల్ గా పెట్టాకున్నామని దర్శకుడు చెప్పారు. కాగా తెలుగు టైటిల్ పెట్టుకున్న ఈ తమిళ సినిమా, తెలుగులో కూడా అనువాదమయ్యే అవకాశాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం :