సినీ కార్మికుల కోసం ముందుకొస్తున్న తమిళ హీరోలు

Published on Mar 24, 2020 6:18 pm IST


కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా సినీ పరిశ్రమ పూర్తిగా మూతబడిన సంగతి తెలిసిందే. ఈ లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ మొత్తం ఆగిపోయాయి. వేలాది మంది రోజువారీ సినీ కార్మికులకు ఈ పరిణామం పెద్ద సమస్యగా మారింది. రోజువారీ అవసరాలకు చాలా మంది కార్మికులు ఇబ్బందిపడుతున్నారు. దీంతో తమిళ సినీ పెద్దలు వారికి అండగా నిలవడానికి ముందుకొచ్చారు.

ఫిల్మ్ ఎంప్లాఈస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా ప్రెసిడెంట్ ఆర్కే సెల్వమని నిన్న నిధుల కోసం పిలుపునివ్వగా శివ కుమార్, సూర్య, కార్తిలు తమ వంతుగా రూ.10 లక్షల విరాళాన్ని ప్రకటించగా తాజాగా మరొక హీరో శివ కార్తికేయన్ రూ.10 లక్షల సహాయాన్ని ప్రకటించారు. త్వరలోనే ఇంకొందరు నటీనటులు సైతం విరాళాలను అందించే అవకాశం ఉంది. ఈ మొత్తాన్ని లాక్ డౌన్ సమయంలో ఇబ్బందులు పడుతున్న అన్ని విభాగాల్లోని సినీ కార్మికులకు అందజేయనున్నారు.

సంబంధిత సమాచారం :

X
More