కూలీ ఎఫెక్ట్ : ఆ విషయంలో తమిళ సినిమా ఇండస్ట్రీ ఇంకా వెయిట్ చేయాల్సిందే..!

కూలీ ఎఫెక్ట్ : ఆ విషయంలో తమిళ సినిమా ఇండస్ట్రీ ఇంకా వెయిట్ చేయాల్సిందే..!

Published on Aug 16, 2025 5:00 PM IST

Coolie 00

తమిళ సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్స్ మొదలుకొని చిన్న హీరోల వరకు మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ వద్ద తమ సత్తా చాటుతున్నారు. అయితే, కొన్ని రికార్డుల విషయంలో తమిళ చిత్ర పరిశ్రమ ఇంకా వెనుకబడి ఉందని చెప్పాలి. ముఖ్యంగా ఓ చిత్రం వెయ్యి కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించడం అనేది చాలా అరుదు. ఇలాంటి ఫీట్ చాలా తక్కువ సినిమాలు చేశాయి. మన టాలీవుడ్‌లో బాహుబలి మొదలుపెట్టిన ఈ ఫీట్‌ను ఆ తర్వాత కొన్ని సినిమాలు కంటిన్యూ చేశాయి. హిందీలో ఇప్పటికే పలు సినిమాలు ఈ రికార్డును దక్కించుకున్నాయి. ఇక కన్నడలోనూ కే జి యఫ్ వంటి సినిమా ఈ రికార్డును అందుకుంది.

కానీ, తమిళ ఇండస్ట్రీలో వెయ్యి కోట్లు కలెక్ట్ చేసిన సినిమా ఒక్కటి కూడా లేదు. దీంతో ఈ ఫీట్ అందుకోగల ఒకే ఒక సినిమా కూలీ అని అందరూ అనుకున్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్, స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో భారీ క్యాస్టింగ్‌తో వస్తున్న సినిమా కావడంతో కూలీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూశారు. దీనికోసమే ఈ సినిమాను ఫస్ట్ డే చూడాలని ప్రేక్షకులు పెద్ద ఎత్తున థియేటర్లకు ఎగబడ్డారు.

కట్ చేస్తే.. ఈ సినిమాకు మిక్సిడ్ రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా ఓపెనింగ్ రోజు తర్వాత కాస్త డీలా పడిందనే చెప్పాలి. దీంతో ఇప్పుడు ఈ సినిమా కూడా వెయ్యి కోట్ల కలను కలగానే మిగిల్చిందని తమిళ ఆడియన్స్ ఫీల్ అవుతున్నారు. ఏదేమైనా కూలీ ఎఫెక్ట్‌తో కోలీవుడ్ కల ఎప్పటికి నెరవేరుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు