మెగా హీరో సినిమాలో తమిళ స్టార్ హీరో కన్ఫర్మ్ !

Published on Mar 17, 2019 4:00 am IST

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడన్న విషయం తెలిసిందే. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ తన మొదటి సినిమాలో నటించనున్నాడు. ఇటీవలే ఈ చిత్రం గ్రాండ్ గా లాంచ్ అయ్యింది.

ఇక ఈ చిత్రంలో తమిళ స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్ పాత్రలో నటించనున్నాడని ఇటీవల వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వార్తలు నిజమేనని సమాచారం వస్తుంది. ఈ సినిమాకి విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. సుకుమార్ రైటింగ్స్ ,మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించనున్నాయి.

సంబంధిత సమాచారం :

More