విడుదలకు సిద్దమవుతోన్న “తప్పించుకోలేరు”

Published on Jul 21, 2021 2:00 pm IST

తెలుగు సినీ పరిశ్రమలో మరొక సూపర్ సస్పెన్స్ థ్రిల్లర్ విడుదల కి సిద్దం అవుతోంది. ఆర్.వి.జి మూవీస్ మరియు ఎస్.వి.ఎల్ ఎంటర్ ప్రైజేస్ పథకాల పై సంయుక్తం గా రుద్రపట్ల వేణుగోపాల్, తలారి వినోద్ కుమార్, శ్రీనివాస్ మామిడాల, లలిత్ కుమార్ తప్పించుకోలేరు చిత్రం ను నిర్మిస్తున్నారు. కొట్టకథ, ఉసురు, అయ్యప్ప కటాక్షం వంటి చిత్రాలతో దర్శకుడు గా తన చాటుకున్న ఆర్.వి.జి ఇప్పుడు తప్పించుకోలేరు తో ముందుకు వస్తున్నారు. అయితే ఈ చిత్రం సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఆగస్ట్ ప్రథమార్థం లో విడుదల కి సిద్దం అయింది. ఆదర్శ్, హరీష్, ట్వింకిల్ అగర్వాల్, సాయి శ్వేత, ఆకెళ్ళ, ఫహీం ప్రధాన తారాగణం తో ఈ చిత్రం తెరకెక్కింది.

అయితే మధ్యప్రదేశ్ లోని భోపాల్ గ్యాస్ సంఘటన స్ఫూర్తి తో ఈ చిత్రం తెరకెక్కినట్లు తెలుస్తోంది. అయితే మధ్యప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సౌజన్యం తో చాలా భాగం భోపాల్ మరియు పరిసర ప్రాంతాల్లో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంది. అయితే ఈ చిత్రాన్ని అక్కడ కూడా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. అయితే ఇండియన్ స్క్రీన్ పై వచ్చిన అన్ని సస్పెన్స్ థ్రిల్లర్స్ కంటే డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో రూపొందిన చిత్రమిది అంటూ దర్శకుడు చెప్పుకొచ్చారు. ఆగస్ట్ ఫస్టాఫ్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం రాజేష్ రాజ్ టి అందించారు.

సంబంధిత సమాచారం :