ఆగస్ట్ 13 న థియేటర్ల లో “తప్పించుకోలేరు” విడుదల!

Published on Jul 28, 2021 12:00 pm IST


కొత్తకథ, ఉసురు, అయ్యప్ప కటాక్షం చిత్రాలతో తన సత్తా చాటుకున్న దర్శకుడు రుద్రపట్ల వేణుగోపాల్. తప్పించుకోలేరు చిత్రం తో మరొకసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్దం అయ్యారు. ఆర్ వి జీ మూవీస్ ఎస్ వి ఎల్ ఎంటర్ ప్రైజెస్ పతకాల పై ఈ చిత్రం ను నిర్మించడం జరిగింది. అయితే ఈ చిత్రం సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఆగస్ట్13 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. అయితే ఈ నేపథ్యం లో దర్శకుడు మాట్లాడుతూ, మా చిత్ర రూప కల్పన లో మధ్య ప్రదేశ్ పర్యాటక శాఖ అందించిన సహయ సహకారాలు మరువలేనివి అని అన్నారు.

అయితే డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో రూపొందిన ఈ చిత్రం ను ఆగస్ట్13 వ తేదీన విడుదల చేస్తున్నట్లు తెలిపారు. అయితే వి. ఎస్.పి తెన్నేటి మాటలు పాటలు, రాజేష్ రాజ్ మ్యూజిక్ ఈ చిత్రానికి మెయిన్ ఎసెట్స్ అంటూ చెప్పుకొచ్చారు. ఈ చిత్రం లో ఆదర్శ్, హరీశ్, ట్వింకిల్ అగర్వాల్, సాయి శ్వేత, ఆకెళ్ళ, ఫహీం ముఖ్య తారాగణం గా ఈ చిత్రం తెరకెక్కింది.

సంబంధిత సమాచారం :