తాప్సీ వెడ్డింగ్ ప్లానర్ అవతారం!

తాప్సీ వెడ్డింగ్ ప్లానర్ అవతారం!

Published on May 15, 2015 5:15 PM IST

Tapsee

తన అందం, నటనతో తెలుగులో వరుస సినిమాలతో ఆకట్టుకున్న తాప్సీకి ఆ తర్వాత వరుసగా బాలీవుడ్ అవకాశాలు వచ్చి పడ్డాయి. తెలుగు తమిళ, హిందీ సినిమా అవకాశాలతో నటిగా బిజీ బిజీగా మారిపోయిన తాప్సీ కొత్తగా ఓ బిజినెస్ లాంచ్ చేసింది. తన చెల్లి షాగున్, ఫ్రెండ్ ఫరాహ్ పర్వరేష్‍లతో కలిసి తాప్సీ ఓ వెడ్డింగ్ ప్లానింగ్ కంపెనీ ప్రారంభించింది.

ఈ విషయం గురించి మాట్లాడుతూ.. “చెల్లి షాగూన్, ఫ్రెండ్ ఫరాహ్‌తో కలిసి ఓ బిజినెస్ ప్లాన్ చేశా. మా అందరి టేస్ట్‌కి, నాలెడ్జ్‌కి సరిపోయేదైన వెడ్డింగ్ ప్లానింగ్‌ అయితే బాగుంటుందని అన్ని విధాలా ఆలోచించి ఈ కంపెనీని ప్రారంభించాం” అంటూ తెలిపింది. ‘వెడ్డింగ్ ఫ్యాక్టరీ’ పేరుతో లాంచ్ అయిన ఈ బిజినెస్‌ విషయంలో తాప్సీ అన్నీ దగ్గరుండి చూసుకుంటుందట. కంపెనీకి సంబంధించిన వెబ్‌సైట్ కూడా ప్రారంభించారు. ఇప్పటికే చాలా ఈవెంట్‌లు చేయడానికి అవకాశాలు వస్తున్నాయని చెప్పుకొచ్చింది తాప్సీ. సినిమాల్లో సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్న తాప్సీ కొత్తగా స్టార్ట్ చేసిన బిజినెస్‌లోనూ మంచి విజయం సాధించాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్.

తాజా వార్తలు