‘అమరావతి’ తరువాత మళ్లీ ఈ సినిమాతోనే !

Published on Feb 18, 2019 8:58 am IST

శివ‌ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వంలో నంద‌మూరి తార‌క‌ర‌త్న‌, మేఘ శ్రీ జంట‌గా చాందిని క్రియేష‌న్స్ ప‌తాకం పై నాగ‌రాజు నెక్కంటి తెలుగు,క‌న్న‌డ భాష‌ల్లో నిర్మిస్తున్న చిత్రం `అమృత వ‌ర్షిణి`. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం చాలా బాగా వస్తోందట. రవిబాబు తీసిన ‘అమరావతి’ తరువాత మళ్లీ తారక్ రత్నకు అంతటి పేరు ఈ సినిమా తీసుకొస్తుందని నమ్మకంగా చెబుతుంది చిత్రబృందం.

అలాగే ఈ చిత్రం కథ మంచి ఇంటెన్స్ ఉన్న స్టోరి అని.. అదే విధంగా అన్ని ర‌కాల ఎమోష‌న్స్ తో అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఈ చిత్రం ఆకట్టుకుంటుందట. మరి ఈ చిత్రంతోనైనా తారక్ రత్న హిట్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి. ఈ చిత్రానికి స‌భా కుమార్‌ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తుండగా సంగీత దర్శకుడు జెస్సీ గిప్ట్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

సంబంధిత సమాచారం :